Syed Kirmani calls for Rishabh Pant to improve his footwork behind stumps

పంత్‌…ధోనిని కాపీ కొట్టొద్దు!

టీం ఇండియా యంగ్ గ‌న్ రిషబ్‌ పంత్ టెస్ట్ అరంగేట్రం అదిరిపోయింది.ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ ద్వారా రిషబ్‌ పంత్ టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే.అయితే పంత్ వికెట్ల వెనుక మెరుగు కావాల్సింది చాలా ఉందని భారత మాజీ వికెట్‌ కీపర్‌ సయ్యద్‌ కిర్మాణి తెలిపాడు. రిషబ్‌ కీపింగ్‌ టెక్నిక్‌ అంత మెరుగ్గా లేదన్న కిర్మాణి..ఇంకా పంత్‌ నేర్చుకునే దశలోనే ఉన్నాడన్నాడు. ఈ క్రమంలోనే ఎంఎస్‌ ధోని కీపింగ్‌ టెక్నిక్‌ను కాపీ కొట్టొద్దని సూచించాడు.

కీపింగ్‌లో పంత్‌ చాలా మెరుగుపడాలి. స్పిన్‌ బౌలింగ్‌లో బౌలర్‌ టర్న్‌ తీసుకొనే వరకు పంత్‌ కూర్చొని ఉండాలి. బంతి పిచ్‌ అయి ఎటువెళ్తుందో చూసే వరకు కూర్చొని ఉండాలి. ఆ తర్వాత స్వింగ్‌, బౌన్స్‌కు అనుగుణంగా కదలాలి అని కిర్మాణీ అన్నాడు.ఫీల్డర్లు బంతిని విసిరే సమయంలో ధోని వికెట్ల ముందు నిలబడి బంతి అందుకుంటాడు. ధోని అరుదైన వికెట్‌ కీపర్‌. అతనిలో ఒక ప్రత్యేకత ఉంది. అత‌నిని అనుస‌రించ‌వ‌ద్ద‌ని పంత్‌కు సూచించాడు కిర్మాణి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *