Ravindra jadeja first century on his career

కెరీర్‌లో తొలి సెంచ‌రీ చేసిన ర‌వీంద్ర జ‌డేజా

టీంఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా జ‌ట్టులోకి వ‌చ్చి చాలకాల‌మైన ఇప్ప‌టి వ‌రకు సెంచ‌రీ చేయ‌లేక‌పోయాడు.జడేజా బ్య‌ట్స్‌మెన్ క‌న్నా బౌల‌ర్‌గానే ఎక్కువుగా రాణించాడు.అయితే  వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా త‌న ఇంట‌ర్‌నేష‌న్‌లో కెరీర్‌లో తొలి సెంచ‌రీ న‌మోదు చేసుకున్నాడు.క్రీజులోకి వచ్చిన జడేజా తనదైన శైలిలో ఆచితూచి ఆడాడు. .132 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌ల
కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేశాడు.

జడేజా టెయిలెండర్లు కుల్‌దీప్‌(12), ఉమేశ్‌ యాదవ్‌(22), మహ్మద్‌ షమీ(2 నాటౌట్‌)ల సాయంతో ఆచితూచి ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.ఆట మొద‌టి రోజు పృథ్వీ షా శతకం సాధించగా,రెండో రోజు ఆటలో కోహ్లి శతకం సాధించాడు. భారత్‌ 9 వికెట్ల నష్టానికి 649 పరుగులు వ‌ద్ద త‌మ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *