వెస్టిండీస్‌తో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు నేడు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఐదు వన్డేల సిరీస్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకుంటాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.కేదార్ జాదవ్ గాయం బారిన పడటంతో మిడిలార్డర్‌లో అతడి స్థానం ఖాళీ అయింది. దీంతో మరో ఆటగాడిని తీసుకోవాల్సి వస్తోంది.
జడేజా, అంబటి తిరుపతి రాయుడులకు ఢోకా లేదు. భువనేశ్వర్, బుమ్రా తిరిగి రావడం ఖాయం. మొదటి మూడు వన్డేలకు జట్టును ప్రకటిస్తారా? లేక మొత్తం సిరీస్‌కు ఒకేసారి ప్రకటిస్తారా? అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే ఇటీవలే టెస్ట్ మ్యాచ్‌ల్లో ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ వన్డేల్లోనూ అరంగేట్రం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.