Ys jagan satires on 108 ambulance

ఆ అంబులెన్స్‌లో ఎవ‌రు లేర‌ని మాకు తెలుసుగాని పోని పోని… : వైఎస్ జ‌గ‌న్‌

వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో కొన‌సాగిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చీపురుపల్లిలో  ఏర్పాటు చేసిన భారీ బ‌హింరంగ స‌భ‌లో జ‌గ‌న్ ప్రసంగించారు.జ‌గ‌న్ మాట్లాతున్న స‌మ‌యంలో అటుగా వ‌చ్చిన అంబులెన్స్‌కు దారి ఇవ్వాల‌ని అక్క‌డ ఉన్న ప్ర‌జ‌ల‌ను కోరారు.ఈ  సంద‌ర్బంగా జ‌గ‌న్ ప్ర‌సంగిస్తు…. ఆరోగ్యశ్రీపై తాను చేసిన విమర్శలకు సమాధానం చెప్పేందుకు గాను ఖాళీ అంబులెన్స్ లను ప్రభుత్వం ఇలా తిప్పుతోందని జగన్  విమర్శించారు.

అంబులెన్స్ లో పేషేంట్ ఎవరూ లేరని అంటూనే అంబులెన్స్ కు దారి ఇవ్వాలని పార్టీ శ్రేణులకు జగన్ సూచించారు. వైఎస్ఆర్ హయంలో అంబులెన్స్ 20 నిమిషాల్లో  చేరుకొనేదన్నారు. ప్రస్తుతం అంబులెన్స్ షెడ్లలో మూలనపడ్డాయన్నారు.ఆ అంబులెన్స్‌లో ఎవ‌రు లేర‌ని మాకు తెలుసు కాని తొంద‌ర‌గా వెళ్లండి అంటూ త‌న ప్ర‌సంగాన్ని  కొన‌సాగించారు జ‌గ‌న్‌.త‌మ పార్టీ అధికారంలోకి రాగ‌నే 1000 దాటిని ప్ర‌తి వైద్యనికి ఆరోగ్య శ్రీలో చోటు క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు జ‌గ‌న్‌.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *