Why kcr target ap cm chandr babu

చంద్ర‌బాబునే టార్గెట్ చేసిన‌ కేసీఆర్‌

తెలంగాణ‌లో ఎన్నిక‌లో స‌మ‌రం మొద‌లైంది.ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన కేసీఆర్ ,పార్టీ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు.నిన్న న‌ల్గొండ జిల్లాలో జ‌రిగిన ఎలెక్ష‌న్ మీటింగ్‌లో పాల్గోన్న కేసీఆర్ కాంగ్రెస్ ,టీడీపీ పార్టీల‌పై విరుచుప‌డ్డారు.ఈ తరుణంలోనే చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని కేసీఆర్ ప్రధానంగా విమర్శలు గుప్పించారు.తెలంగాణకు చంద్రబాబునాయుడు ఎలా అడ్డం పడ్డారనే విషయాలను కేసీఆర్ ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రజల ముందు సెంటిమెంట్‌ను ప్రస్తావిస్తున్నారు. ఎన్నిక‌ల‌లో మ‌హ‌కూట‌మి విజ‌యం సాధిస్తే మ‌ళ్లీ మ‌న బతుకులు అమ‌రావ‌తి చూట్టునే తిర‌గాలి అని కేసీఆర్ చంద్ర‌బాబుని ఉద్దేశించి మాట్లాడారు.

2014 జ‌రిగిన ఎన్నిక‌ల‌లో టీడీపీ పార్టీ తెలంగాణ‌లో 15 అసెంబ్లీ సీట్లు ,ఒక ఎంపీ సీటును గెలుచుకుంది.త‌రువాత కాలంలో 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ప్ర‌స్తుతం టీడీపీలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఒక్కడే ఉన్నాడు. ఆర్. కృష్ణయ్య టీడీపీ త‌రుపున గెలిచిన త‌ట‌స్థంగా ఉండిపోయారు.లీడ‌ర్లు వెళ్లిన క్యాడ‌ర్ పార్టీతోనే ఉంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నాడు.తెలంగాణ‌లో 20 చోట్ల టీడీపీ గెలిచే అవ‌కాశాలు ఉన్నాయని చంద్ర‌బాబు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.కాంగ్రెస్‌,టీడీపీ పార్టీలు క‌లిసి పోటీ చూస్తే ఖ‌చ్చితంగా మ‌హ‌కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌ని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.దీని కార‌ణంగానే సీఎం కేసీఆర్ ఏపీ సీఎం చంద్ర‌బాబుని ల‌క్ష్యం చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారని రాజకీయ విశ్లేషుకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *