Tjs leader kodandaram comments on mahakutami

కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేసిన కోదండరాం

టీజెఎస్ అధినేత కోదండరాం కాంగ్రెస్ పార్టికి అల్టిమేటం జారీ చేశారు.ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన కోదండంరాం ప్రతిపక్షాలన్ని కలిసి ఏర్పడిని ఈ మహాకూటమి టీఆర్ఎస్ పార్టీని గద్దెదించడం ఖాయమని అన్నారు. మహకూట‌మిలోని పార్టీల మధ్య పొత్తుల విషయంలో ఆలస్యం జరిగే కొద్దీ గందరగోళం తలెత్తుతోందన్నారు.

దీంతో నిరంకుశ శక్తులకు లాభం జరిగే ప్రమాదమున్నందున త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని తాను డిమాండ్ చేసినట్లు కోదండరాం వివరించారు.కూటమిలోని మిత్ర పక్షాలకు సీట్లు కేటాయించే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ సపార్టీయే అని ఆయన స్పష్టం చేశారు. అయితే తెలంగాణ జనసమితి మాత్రం గెలిచే స్థానాలనే కేటాయించాలని కోరుతున్నట్లు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *