Telangana ,election campaigner, vijayashanthi ,kcr,congress

కేసీఆర్ దుమ్ము దులిపిన రాముల‌మ్మా

భార‌తదేశంలో ఎలెక్ష‌న్లు అనేది చాలా పెద్ద‌ ప్ర‌క్రియ.పైగా ఖ‌ర్చుతో కూడుకున్న‌ది.దేశంలో ఎప్పుడు ,ఎక్క‌డ ఎలెక్ష‌న్స్ జ‌రిగిన రాజ‌కీయ నాయకులు ఎంత బిజీగా అవుతారో ,సినీ ప్ర‌ముఖులు కూడా అంతే బిజీగా ఉంటారు.మ‌న‌దేశంలో రాజ‌కీయ నాయ‌కుల‌ను ,సినీ ఇండ‌స్ట్రీ వాళ్ల‌ను వేరుగా చూడాలేం.సినీ గ్లామ‌ర్‌కు ఓట్లు ప‌డ‌తాయని రాజ‌కీయ విశ్లేషుకుల భావ‌న‌. అప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయల‌కు దూరంగా ఉన్న‌వారు సైతం ఎలెక్ష‌న్స్ టైంకు వివిధ పార్టీలలో చేరి త‌మ అదృష్టాన్ని ప‌రిక్షించుకుంటారు.తాజాగా అటువంటి సీన్ తెలంగాణ రాష్ట్రంలో జ‌రుగుతుంది.

ఒకప్ప‌టి హీరోయిన్ స్టార్ హీరోయిన్ విజ‌య‌శాంతి… త‌ల్లి తెలంగాణ పేరుతో ఓ పార్టిని స్థాపించింది.ఆ పార్టీని న‌డ‌ప‌లేక కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీలోను విలీనం చేసింది విజ‌య‌శాంతి.కొన్నాళ్లు వ‌ర‌కు విజ‌య‌శాంతి,కేసీఆర్ మ‌ధ్య బంధాలు బాగానే సాగిన‌ప్ప‌టికీ ,త‌రువాత కాలంలో వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి బ‌య‌టికి వ‌చ్చి 2014 ఎలెక్ష‌న్స్‌కు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరింది విజ‌య‌శాంతి.2014లో జ‌రిగిన ఎలెక్ష‌న్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవ‌డంతో ,ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డ క‌నిపించ‌లేదు మ‌న రాముల‌మ్మ‌.ఇదిగో మ‌ళ్లీ తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎన్నిక‌లు షూరు అవ్వ‌గానే స‌డ‌న్‌గా హైద‌రాబాద్‌లో ప్ర‌త్య‌క్షం అయింది విజ‌య‌శాంతి.

వ‌చ్చి రావ‌డంతోనే కేసీఆర్ పాల‌న‌పై విరుచుకుప‌డింది.వ‌చ్చి రావ‌డంతోనే కేసీఆర్ దుమ్ము దులిపింది. విజ‌య‌శాంతి కేసీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతు తెలంగాణ ప్ర‌జ‌లు నీకు పిచ్చోళ్ల‌లాగా కనిపిస్తున్నారా అంటూ కేసీఆర్‌పై మండిప‌డింది.నీకు ప్ర‌జ‌లు అధికారం ఇచ్చి ఐదు సంవ‌త్సరాలు ప‌రిపాలించ‌మంటే ,నువ్వు అధికారం కోసం క‌క్కుర్తి ప‌డి ముందస్తు ఎన్నిక‌లకు వెళ్తున్నావ్ అంటూ కేసీఆర్‌పై ఫైర్ అయింది రాముల‌క్కా.ఈ ఐదు సంవ‌త్సరాల‌లో ఒక్క క‌ల్వ‌కుంట్ల కుటుంబం త‌ప్ప మ‌రో కుటుంబం బాగుప‌డ‌లేద‌ని ,ఈ ద‌రిద్రం పోవ‌లంటే కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌కు ఓట్లు వేసి గెలిపించాల‌ని కోరింది విజ‌య‌శాంతి.రాముల‌క్కా ఆవేశం చూసిన తెలంగాణ ప్ర‌జ‌లు ఈ వేడి ఎలెక్ష‌న్స్ త‌రువాత కూడా ఉంటే బాగుండు అని చ‌ర్చించుకోవ‌డం విశేషం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *