Tdp leader join's pawan kalyan janasena

టీడీపీ కీల‌క నేత జ‌న‌సేన‌లోకి..?

న‌టుడు,ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి.ఇటీవ‌లే మాజీ స్పీక‌ర్ నాందెడ్ల మ‌నోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జ‌న‌సేన‌లో చేరిన సంగ‌తి తెలిసిందే.ఇప్పుడు టీడీపీ వంతు వ‌చ్చింది. ఆ పార్టీకి చెందిన సుందరపు విజయ్‌కుమార్ తనను దూరం పెట్ట‌రనే ఉద్దేశంతో టీడీపీ పార్టీకి రాజీనామా చేసి జ‌న‌సేన‌లో చేరారు.ఈ సంద‌ర్భంగా సుందరపు విజయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతు..చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ పార్టీ బాధ్యతలు స్వీకరించినట్లు ఆయ‌న తెలిపారు.పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఎన్నికల్లో 91 గ్రామ పంచాయితీల్లో 41 గ్రామ పంచాయితీలను టీడీపీ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించినట్టు ఆయన చెప్పారు. తనకు న్యాయం చేస్తానని చంద్రబాబునాయుడు, లోకేష్ ఇచ్చిన హమీలను అమలు చేయలేదన్నారు. త‌న అనుచరులతో కలిసి ఈ నెల 19వ తేదీన జనసేనలో చేరుతున్నట్టు విజయ్‌కుమార్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *