Pawan kalyan comments on nara lokesh

స‌ర్పంచ్‌గా కూడా గెల‌వ‌లేని లోకేష్ మంత్రి  అయ్యాడు – ప‌వ‌న్ క‌ల్యాణ్‌

జ‌న‌సేన అధినేత ,న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్  పోలవరం పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్‌పై ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వాఖ్య‌లు చేశారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాల్లో జనసేన పాతుకుపోయి ,వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని సీఎం చంద్రబాబు, లోకేష్ లు భయపడుతున్నారని విమర్శించారు. స‌ర్పంచ్‌గా కూడా గెల‌వ‌లేని లోకేష్ దొడ్డిదారిన మంత్రి ఎలా అయ్యాడో అంద‌రికి తెలుసున‌ని తెలిపారు ప‌వ‌న్‌.ఏపీ ప్ర‌భుత్వం పూర్తిగా అవినీతిగా మారింద‌ని,ప్రాజెక్టుల నిర్వాసితులకు సరైన న్యాయం జరగడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప‌వ‌న్‌.

కౌలు రైతులకు అండగా ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని పవన్ భరోసా ఇచ్చారు.ఇక ఇదే స‌మయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మండిప‌డ్డారు ప‌వ‌న్‌.వీధుల్లో గాలికి లేచే ఆకురౌడీ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి వ్యక్తులను వెనకేసుకు వస్తారనుకుంటే చంద్రబాబుకు మద్దతు ఇచ్చే వాడిని కాదని పవన్ స్పష్టం  చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *