mla-giddi-eswari-threats-her-relatives-in-visakhapatnam

ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రిపై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు

ఇటీవ‌లే వైసీపీ నుంచి టీడీపీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రిపై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.అర్ధరాత్రి ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి మా ఇంటిపై రాళ్లు రువ్వారని, మా స్థలం ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేయడానికి పూనుకుంటున్నారని చింతలవీధి ఎంపీటీసీ గిడ్డి విజయలక్ష్మి సోమవారం పాడేరు సబ్‌ కలెక్టర్‌ డి.కె.బాలాజీ దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసు అధికారులు, సిబ్బందిని కూడా లెక్క చేయకుండా ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి కూలీలను తీసుకువచ్చి దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణానికి ఉపక్రమించారని తెలిపారు.

స్థల వివాదం కోర్టులో ఉన్నందున ఇరువర్గాల వారు ఎటువంటి పనులు చేయరాదని తహసీల్దార్‌ సూచించారని, అయినా ఎమ్మెల్యే రోడ్డుకోసం స్థలం ఆక్రమిస్తుండడంపై తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి అని కోరారు ఎంపీటీసీ గిడ్డి విజయలక్ష్మి.ఎంపీటీసీ గిడ్డి విజయలక్ష్మి వైసీపీ పార్టీ ఎంపీటీసీగా ఉండ‌ట‌మే ఈ వివాదానికి కార‌ణం అని తెలుస్తుంది.గిడ్డి ఈశ్వ‌రి పార్టీ మారే స‌మ‌యంలో విజయలక్ష్మికూడా త‌న‌తో వ‌స్తుంద‌ని భావించి భంగ‌ప‌డ్డారు ఎమ్మెల్యే.దీంతో ఎంపీటీసీపై ఇలా క‌క్ష్య సాధిస్తున్నారని స్థానికుల ద్వారా తెలుస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *