Minister nayani narasimha reddy hopes on musheerabad mla ticket

ఆ సీటు నాదే అంటోన్న మంత్రి నాయిని..మ‌రి కేసీఆర్ మ‌దిలో ఎవ‌రున్నారు?

తెలంగాణ రాష్ట్రంలో ముంద‌స్తు ఎలెక్ష‌న్ల హ‌డావిడి మొద‌లైంది.ఇప్ప‌టికే టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు సీఎం కేసీఆర్ టిక్కెట్ల‌ను ఖారారు చేయ‌డంతో వారు ప్ర‌చార కార్య‌క్ర‌మంలో దూసుకుపోతున్నారు.అయితే ఇంకా ముషీరాబాద్ అసెంబ్లీ టిక్కెట్‌పై స‌స్పెన్స్ కొనసాగుతుంది.సెప్టెంబర్ 6 వతేదీన కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో ముషీరాబాద్ స్థానం నుండి అభ్యర్థిని ప్రకటించలేదు. ముషీరాబాద్ అసెంబ్లీ టిక్కెట్టును నాకే ఇవ్వాలని ప‌ట్టుప‌డుతున్నారు మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి.

ఈ స్థానం నుండి నాయిని నర్సింహ్మరెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా దింపే ఆలోచ‌న‌లో ఉన్నారు నాయిని.ఒక‌వేళ ముషీరాబాద్ టిక్కెట్టు త‌న అల్లుడికి ఇవ్వకపోతే తన టిక్కెట్టు తనకే ఇవ్వాలని కేసీఆర్‌ను కోరననున్నట్టు నాయిని నర్సింహ్మరెడ్డి చెప్పారు.అయితే ముషీరాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి చాల‌మంది టిక్కెట్ ఆశిస్తున్నారు.మ‌రి వీరిలో కేసీఆర్ ఎరికి టిక్కెట్ ఇస్తారో చూడాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *