Kcr ready to 2nd list of mla candidates list

రెండో జాబితాను సిద్ధం చేసిన కేసీఆర్‌..అభ‌ర్థులు వీళ్లేనా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌చార ప‌ర్వంలో దూసుకుపోతున్నారు.తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన రోజునే కేసీఆర్ 105 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.మిగిలిన 14 అభ్యర్థుల జాబితాను పెండింగ్‌లో పెట్టారు.కేసీఆర్ పెండింగ్‌లో పెట్టిన నియోజకవర్గాలన్నీ కీలకమైనవి కావడంతో ఈ స్థానాల‌లో ఎవ‌రిని ఎంపిక చేస్తారో అని అంద‌రిలోను ఆస‌క్తి నెల‌కొంది.ఇక ఈలోపే ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అవ్వ‌డం,ప్ర‌చారంలో బిజీ అయ్యారు కేసీఆర్‌.మిగిలిన స్థానాల‌కు కూడా అభ్య‌ర్థుల‌న ఎంపిక చేసే ప‌నిలో ప‌డ్డారు కేసీఆర్‌.ఈ నేపథ్యంలో 12 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం.

వరంగల్ ఈస్ట్-నన్నపనేని నరేందర్, మేడ్చల్-సీహెచ్, చొప్పదండి-రవిశంకర్, హుజూర్ నగర్-సైదిరెడ్డి, జహీరాబాద్-ఎర్రోళ్ల శ్రీనివాస్, కోదాడ-చంద్రరావు, ముషీరాబాద్-ఎం గోపాల్, గోషామహాల్-ప్రేమ్ సింగ్ రాథోడ్, వికారాబాద్-రాంచందర్, అంబర్ పేట్-ఎడ్ల సుధాకర్ రెడ్డి, మల్కాజ్ గిరి-మైనంపల్లి హన్మంతరావు, ఖైరతాబాద్-దానం నాగేందర్ లకు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా రెండు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయాల్సి ఉంది.ఆ రెండు స్థానాలకు కూడా అభ్య‌ర్థుల‌ను ఖారారు చేసిన త‌రువాత రెండో జాబితాను విడుద‌ల చేయ‌నున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *