How to face kcr amavasya elections?

అమావాస్య రోజున తెలంగాణ‌లో ఎన్నిక‌లు…మ‌రి కేసీఆర్‌కు క‌లిసి వ‌స్తాయా?

తెలంగాణ రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లింది కేసీఆర్ ప్ర‌భుత్వం.రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలంగాణ‌లో ఎన్నిక‌ల తేదీని ఖారారు చేయ‌డంతో, రాష్ట్రంలో ఎన్నిక‌ల హ‌డావిడి మొద‌లైంది.డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన ఎన్న‌కలు జ‌రుగుతాయ‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించింది.దీంతో ప్రధాన ఎన్నికల పార్టీలన్నీఅధికారం కోసం త‌మ శాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నాలు మొద‌ల‌పెట్టాయి.ఇక్క‌డ వ‌ర‌కు బాగ‌నే ఉన్న‌ప్ప‌టికి డిసెంబర్ 7 తేదీన ఎలెక్ష‌న్స్ జ‌ర‌గ‌డంపై రాజ‌కీయ నాయ‌కులు చాల‌మందికి న‌చ్చ‌డం లేదు.డిసెంబర్ 7 తేదీ అమావాస్య కావ‌డంతో రాజ‌కీయ నాయ‌కులకు ఈ తేదీపై అభ్యంత‌రం చెబుతున్నారు.

రాజ‌కీయ నాయకుల‌కు ముహుర్తాలు,జ్యోతిష్య పండితులపై న‌మ్మ‌కంతో ఉంటారు. ఎలెక్ష‌న్స్ క‌మిష‌న్ పోయి, పోయి అమావాస్య‌ రోజున ఎన్నిక‌లు నిర్వ‌హిస్తుంది ఏంటా అని చ‌ర్చించుకుంటున్నారు. వాస్తు, జ్యోతిష్యం, ముహుర్తాలను విపరీతంగా న‌మ్మే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అమావాస్య రోజున జ‌రిగే ఎన్నిక‌లు ఎటువంటి ఫ‌లితాలు వ‌స్తాయో అని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్గాలు అందోళ‌న‌లో ఉన్నాయి.మ‌రి అమావాస్య రోజున జరిగే ఎలెక్ష‌న్స్ కేసీఆర్‌కు క‌లిసి వ‌స్తాయో లేదో చూడాలి అంటే డిసెంబర్ 11వ తేదీ వ‌రకు వేచిచూడాల్సిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *