Damodar narasimha wife hit back to congress

ఒక్క రోజులో రెండు పార్టీలు మార్చిన ఘ‌న‌త ఆమెదే..!

కాంగ్రెస్ పార్టీ లీడ‌ర్‌,మాజీ డిప్యూటీ సీఎం భార్య దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి ఒక్క రోజుల‌లోనే రెండు పార్టీలు మార్చి సంచ‌ల‌నం సృష్టించారు.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ భార్యే కాంగ్రెస్ పార్టీ పై న‌మ్మ‌కం లేక వేరే పార్టీలో చేరార‌ని ప్ర‌త్యర్థి పార్టీలు ఎద్దెవ చేశాయి. దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పద్మినీరెడ్డి బీజేపీలో చేర‌డంతో రాష్ట్రం మొత్తం ఒకింత షాక్ గురైంది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న దామోదర రాజనర్సింహ సతీమణి బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ పార్టీలో సైతం లుకలుకలు వినిపించాయి.

అయితే కొన్ని నాట‌కీయ ప‌రిణమాల మ‌ధ్య సాయంత్రానికి పద్మినీరెడ్డి మ‌న‌స్సు మార్చుకుని తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాన‌ని చెప్పారు. బీజేపీలో చేరడంపై పద్మినీరెడ్డి మాట్లాడుతు..అది ఆవేశంలో తీసుకున్న నిర్ణ‌యమని,తాను బీజేపీలో చేరినప్పటి నుంచి కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కార్యకర్తల అభీష్టం మేరకు తిరిగి కాంగ్రెస్ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఉదయం బీజేపీలో చేరిందింది అనుకోకుండా జరిగిన ఘటన అంటూ పద్మినీరెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ టిక్కెట్ ఆశించడం లేదని సామాన్య కార్యకర్తగానే పనిచేస్తానని పద్మినీరెడ్డి తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *