Congress leader join's to pawan janasena

జ‌న‌సేన‌లోకి మరో కాంగ్రెస్ కీల‌క నేత

కాంగ్రెస్ పార్టీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి.రెండు రోజుల క్రిత‌మే మాజీ స్పీక‌ర్ నాందెడ్ల మ‌నోహ‌ర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మ‌క్షంలో జ‌న‌సేన పార్టీ చేరారు.తాజాగా కాంగ్రెస్ పార్టీలోని మ‌రో కీల‌క నేత జ‌న‌సేనలోకి చేరాడానికి సిద్ధం అయినట్లు స‌మాచారం.దాదాపు 30 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ‌లు అందించిన చలమల శెట్టి రమేష్ శ‌నివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.చలమల శెట్టి రమేష్ డీసీసీ ఉపాధ్యక్షుడిగా సేవ‌లు అందించారు.

తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చలమల శెట్టి రమేష్ మాట్లాడుతూ జనసేన విధానాలు నచ్చి ఆ పార్టీలోకి చేరబోతున్నట్లు తెలిపారు. తనతోపాటు కొత్తపల్లి పార్టీ గ్రామ అధ్యక్షుడు పల్నాటి చంటి, మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రామకృష్ణ, తదితరులు పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. త్వరలో పవన్‌కళ్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరబోతున్నట్లు చెప్పారు.రాబోవు రోజుల‌లో కాంగ్రెస్ నుంచి జ‌న‌సేన‌లోకి మ‌రిన్ని చేరిక‌లు ఉంటాయ‌ని తెలుస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *