Ap cm chandrababu thinking about babli case

కోర్టుకు ర్యాలీగా వెళ్లే ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి బాబ్లీ కేసుకు సంబంధించి ధర్మాబాద్ కోర్టుకు హాజ‌రుకావాల్సి ఉంది.అయితే మొద‌ట్లో దీనిని పెద్ద సీరియ‌స్‌గా తీసుకోలేదు చంద్ర‌బాబు.కాని బీజేపీ పార్టీని న‌మ్మే స్థితిలో లేరు చంద్ర‌బాబు.త‌న‌పై క‌క్ష్య‌క‌ట్టి ఇలా చేస్తున్న‌రాని భావించిన చంద్ర‌బాబు బాబ్లీ కేసులో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రివ‌ర్గంతో చ‌ర్చించి కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

ధర్మాబాద్ కోర్టుకు ప్రజలతో కలిసి ర్యాలీగా వెళ్తే బాగుంటుందని ఏపీ మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించింద‌ని స‌మాచారం.అయితే అడ్వకేట్ జనరల్, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు స్పష్టం చేశారు. ధర్మాబాద్ కోర్టు వారెంట్ పై శనివారం సీనియర్ మంత్రులు, అడ్వకేట్ జనరల్,న్యాయ నిపుణులతో సమావేశం కానున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *