Actor madhavi latha fire on padmini reddy

పద్మినీ రెడ్డిపై మండిప‌డ్డ సినీన‌టి మాధ‌వి

మాజీ డ్యిప్యూటి సీఎం దామోదర రాజనర్శింహ సతీమణి పద్మినీ రెడ్డి నిన్నహంగామా సృష్టించిన సంగ‌తి తెలిసిందే.దామోదర రాజనర్శింహ భార్య పద్మినీ రెడ్డి నిన్న బీజేపీ పార్టీలో చేరి కాంగ్రెస్ నాయ‌కుల‌కు షాక్ ఇచ్చింది. తిరిగి సాయంత్రం అంతే వేగంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి, ఈసారి బీజేపీ పార్టీ నాయ‌కుల‌కు షాక్ ఇచ్చింది పద్మినీ రెడ్డి.ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలత పద్మినీ రెడ్డి వ్య‌వ‌హారంపై మండిపడింది. ‘పొద్దున్నే మోదీ జీ ఐడియాలజీ సూపర్.. సాయంత్రం అయ్యేసరికి పోయింది. చేరబోయే ముందు ఆలోచన లేదా? పసిపిల్లలా? పాలు తాగుతున్నారా, ఏమీ తెలియకపోవడానికి.

పద్మినీ రెడ్డి గారూ చాలా గొప్ప ప్లాన్ తో కోవర్ట్ పాలిటిక్స్ చెయ్యడానికి బీజేపీలోకి అడుగువేశారు.మోదీ గారి పాలన నచ్చిందా? లేక వచ్చే ఎన్నికలలో బీజేపీ ప్లాన్స్ తెలుసుకొని ద గ్రేట్ డియర్ హజ్బెండ్ ఉన్న పార్టీలో చెప్పడానికా? దేనికోసం ఈ నాటకం? నమ్మి ఘనంగా వెల్ కమ్ చెప్పడం బీజేపీ తప్పు కాదు. ఇలాంటి వాటిని కోవర్ట్ పాలిటిక్స్ అంటారు. ఇవి చెయ్యడం ఒక కాంగ్రెస్ కి మాత్రమే చెల్లుతుంది. ఇలాంటి ఉడతా జంప్స్ కి బీజేపీ కదిలేది లేదు. మోదీ జీ వణికేది లేదు’ అని తన పోస్ట్ లో మాధవి విరుచుకుపడ్డారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *