Rajahmundry central jail Prisoner commit suicide

పాపం .. పురుషాంగాన్ని కోసుకుని మ‌రి ఆత్మహత్యాయత్నం!

జైలులోని ఓ ఖైదీ విచిత్రంగా ఆత్మహత్యాయత్నం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు స‌మాచారం అందుతుంది.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం నామవరం గ్రామానికి చెందిన వెంకన్న తన పురుషాంగాన్ని కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఓ హత్య కేసులో భాగంగా కోర్టు అత‌నికి ఐదేళ్ళ కారాగార శిక్ష విధించింది.రాజమండ్రి సెంట్రల్ జైలులో గత సంవత్సరం నుండి శిక్ష అనుభవిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు గానీ ఎవరూ చూడటానికి రాలేదు.

దీంతో అతడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.ఇలా బ్ర‌త‌క‌డం క‌న్నా చవ‌డం మేలు అనుకుని శుక్ర‌వారం రాత్రి సమయంలో బాత్‌రూంలోకి వెళ్లి తన పురుషాంగాన్ని కోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించాడు.రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో పడివున్న వెంకన్నను గమనించిన తోటి ఖైదీలు జైలు సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే వెంకన్నను ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డంతో అత‌ని ప్రాణానికి ఎటువంటి అపాయం లేద‌ని డాక్టర్లు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *