Panchayati punishment to girl for love affair

వేరే కులం వ్య‌క్తిని ప్రేమించింద‌ని….

అగ్ర కులానికి చెందిన అమ్మాయి,త‌క్కువ కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించింద‌ని ఆమెకు శిక్ష విధించారు ఊరు పంచాయితీ పెద్ద‌లు.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలంలోని బీంరెడ్డిగూడెం గ్రామానికి చెందిన యువతి(18)..రేచపల్లికి చెందిన యువకుడు(20) ప్రేమించుకున్నారు. విషయం ఆర్నెల్ల క్రితం యువతి తాలూకూ కుటుంబ సభ్యులు..ఆ గూడెం వాసుల దృష్టికి వచ్చింది. యువతి కుటుంబం ఫిర్యాదు మేరకు యువకుడిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని జైలుకు పంపారు.

అప్పట్నుంచి తల్లిదండ్రులు కుమార్తెను మరో గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉంచారు.గ్రామ కట్టుబాటు తప్పినందుకుగానూ సదరు యువతి కుటుంబానికి రూ.26 వేల జరిమానా విధించారు. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించినందుకు నాలుకపై బంగారు తీగతో కాల్చాలని, మరో సారి తప్పు చేయకుండా గుండుగీసి ఊరేగించాలని తీర్మానించారు. ఆశిక్షను అమలు చేసే లోపు.. పోలీసులు వచ్చి ఆ యువతిని రక్షించారు. యువతి ఫిర్యాదు మేరకు కుల పెద్దలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *