గత వారం విశాఖపట్నంలో వైసీపీ అధినేత జగన్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే.జగన్‌పై దాడి గురించి రాజకీయ పార్టీలు అన్ని ఆరోపణలు చేసుకుంటున్నారు.ప్రధాన నిందితుడు శ్రీనివాస రావుని పోలీసులు విచారిస్తున్నారు.దీనిలో భాగంగానే విశాఖ వైసీపీ ఆఫీస్‌లో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కేకే అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. జగన్‌పై దాడి కేసులో కేకేను విచారిస్తున్నట్టు సమాచారం.
అక్టోబర్ 25వ తేదీన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీనివాసరావు అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అనుమానితులను సిట్ విచారిస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తున్నారు. అయితే వైసీపీ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నకేకేను పోలీసులు విచారించడం ప్రాధాన్యత సంతరించుకొంది.అతడిపై అనుమానం వచ్చిన కారణంగానే విచారించినట్లు తెలుస్తుంది.