Naxalites plan to recce for telangana minister ktr

కేటీఆర్‌పై న‌క్స‌లైట్లు రెక్కీ ?

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై న‌క్స‌లైట్లు రెక్కీ నిర్వ‌హిస్తున్నాయా అంటే అవున‌నే అంటున్నాయి ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు.కేటీఆర్‌పై జనశక్తి రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జనశక్తి జిల్లా కార్యదర్శి జక్కుల బాబుతో పాటు మరో నక్సలవైట్ శ్రీకాంత్‌ పట్టుబడ్డారు. తంగెళ్ళపల్లి మండలం చిన్నలింగాపూర్‌ గ్రామానికి చెందిన బాబు 2016లో జనశక్తి విప్లవ పార్టీ ద్వారా అజ్ఞాతంలోకి వెళ్లాడు.

తనకు జనశక్తి అగ్ర నాయకత్వం ఓ ఆయుధాన్ని అప్పగించిందని, సిరిసిల్ల ప్రాంతంలో పార్టీ పునర్మిర్మాణ బాధ్యతలను అప్పగించిందని విచారణలో అత‌ను చెప్ప‌డ‌ని తెలుస్తుంది.అందులో భాగంగానే మంత్రి కేటీఆర్‌ను నక్సలైట్లు లక్ష్యం చేసుకున్నారని అంటున్నారు. దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *