తెలంగాణ రాష్ట అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ పూర్తి హవా చూపించింది. అయినప్పటికి తన హవా చూపించారు కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి. ఆయన సంగారెడ్డి నుంచి మంచి మెజార్టీతో విజయం సాధించారు. జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతున్నారనే వార్తలపై స్పందించిన జగ్గారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సంగారెడ్డి ప్రజల సంక్షేమం కోసం తాను పాటుపడుతానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఎవరూ కూడ పార్టీని వీడబోరని ఆయన అభిప్రాయపడ్డారు.తాను సంగారెడ్డి ప్రజలకు తాను ఇచ్చిన హామీలు తనను గెలిపించాయని చెప్పారు. మెదక్ ఎంపీ సీటును తన భార్యకు ఇవ్వాలని కోరుతున్నట్టు చెప్పారు.