kerala traffic police fined cyclist

సైకిల్‌పై వెళ్తున్న వ్య‌క్తికి 2000 ఫైన్ విధించిన ట్రాఫిక్ పోలీసులు

సాధార‌ణంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ లేక‌పోతేనో,కారు న‌డుపుతున్న వారు సీటు బెల్ట్ పెట్టుకోక‌పోతే ఫైన్ విధిస్తారు ట్రాఫిక్ పోలీసులు.కాని విచిత్రంగా రోడ్డు మీద సైకిల్‌పై వెళ్త‌తున్న వ్య‌క్తిపై ఫైన్ వేశారు మ‌న ట్రాఫిక్ పోలీసులు.ఈ త‌తంగం జ‌రిగింది మ‌న ప‌క్క రాష్ట్రంలో కేర‌ళ‌లోనే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖాసిం కేరళలో వలస కూలీ. కంబాలాలో ప్రధాన రహదారిపై సైకిలుపై వెళ్తుండగా అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేదంటూ జరిమానా విధించారు.

హెల్మెట్ లేకుండా వేగంగా వెళ్లడం నేరమంటూ రూ.2 వేల జరిమానా విధించారు.ఖాసింకు ఇచ్చిన చలానా రసీదుపై ఓ మహిళకు చెందిన స్కూటరు వివరాలు ఉండడంతో అవాక్కైన ఖాసిం తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. రూ.500 కట్టే వరకు పోలీసులు తనను విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనలో పోలీసులపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *