journey from Nobel winner nadia murad

నాడు లైంగిక బానిస ..నేడు నోబెల్ విజేత‌..!

ఆమె 12 ఏళ్ల ప్రాయంలోనే న‌ర‌రూప రాక్ష‌సుల చేతిలో చిక్కుకుంది.అంతే ఆమె జీవితాన్ని ఆ రాక్ష‌సులు చిదిమేశారు.ఆ రాక్ష‌సులు ఎవ‌రో కాదు ఐసిస్ ఉగ్రవాదులు,ఆమె మ‌రెవ్వ‌రో కాదు నదియా మురాద్.లైంగిక బాధితురాలిగా ఉగ్రవాదుల చేతుల్లో సామూహిక అత్యాచారాలకు గురై తల్లిని, తోబుట్టువులను కళ్లెదుటే ఉగ్రవాదులు మట్టుబెడుతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి నదియాది. 2014లో నదియా మురాద్ నివశిస్తున్న సింజర్ ప్రాంతానికి ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడి చేశారు. నల్లని జెండాలతో ట్రక్కుల్లో వచ్చిన ఉగ్రవాదులు నదియా నివాసం ఉంటున్న కోచోలో ఇళ్లలోకి చొరబడి పురుషులను హతమార్చారు.

మహిళలు, బాలికలను పనివాళ్లుగా, లైంగిక బానిసలుగా మార్చేశారు. అలా నదియా మురాద్ లైంగిక బానిసరాలుగా మారిపోయింది. మోసూల్ కొన్ని నెలలపాటు నదియాపై ఉగ్రవాదులు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. నదియాను అపహరించుకుపోయిన కొత్తలో అత్యాచారం చెయ్యబోతుండగా వారితోపోరాడింది. పోరాడి పోరాడి ఆ రాక్షసుల ముందు ఓడిపోయింది. దీంతో ఆ కామాంధుల చేతుల్లో నరకయాతన అనుభవించింది. ఐసిస్ ఉగ్రవాదుల చేతుల్లో నానా యాతన అనుభవిస్తున్న నదియా మురార్ ఆ నరకం నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంది. ధైర్యం తెచ్చుకుని ఆమె అమెరికా సేనలు దాడులు జరుపుతున్న సమయంలో అవకాశం చూసుకుని తప్పించుకుని బయటపడింది. అయితే 2015లో నదియా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాను ఎదుర్కోన్న కష్టాలు, ఐసిస్ ఉగ్రవాదుల ఆకృత్యాలను చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది.

ఉగ్రవాదుల చెరనుంచి బయటపడిన నదియా ఆమెపడ్డ నరకం గురించి చెప్తే సభ్యులు గగుర్పాటుకు గురయ్యారు. ఆమె కష్టాలను నరకాన్ని చూసి యావత్ ప్రపంచం చలించిపోయింది. తనపై జరిగిన అకృత్యాల గురించి, యాజిదీ మహిళలపై జరుగుతున్న దారుణాల గురించి నదియా ఐరాస భద్రతా మండలిలో ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఆమె ధైర్యసాహసాలకు మెచ్చి ఐరాస నదియాను గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా నియమించింది. లైంగిక హింసను అరికట్టేందుకు ఆమె చేస్తున్న కృషికి ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *