IT raids at TDP MP CM Ramesh's places in Telangana, Andhra

సీఎం ర‌మేష్ ఇంటిపై ఐటీ దాడులు ….వ‌ణికిపోతున్న టీడీపీ నేత‌లు

ఆంధ్ర ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న ఐటీ దాడుల‌తో టీడీపీ నేత‌ల గుండెల్లో రైల్లు ప‌రిగెడుతున్నాయి. ఐటీ అధికారులు ఎప్పుడు ఎవ‌రి మీద దాడులు చేస్తారోన‌ని వ‌ణికిపోతున్నారు. తాజాగా టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ ఇంటిపై ఐటీ దాడులు నిర్వ‌హిస్తున్నారు.60 మంది అధికారుల బృందం కడప, హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లు, వ్యాపార కార్యాలయాలపై దాడులు నిర్వహించి సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం రమేశ్ ఢిల్లీలో ఉన్నారు.

ఉదయమే సీఎం రమేష్ ఇంటికి వెళ్లిన ఆదాయపన్ను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం రమేశ్‌ పలు కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆయనకే అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారని టీడీపీ నాయకులే పలు సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం క‌ల‌క‌లం రేపుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *