Gang rape survivor rescued by pet dog in Mumbai

ఛీ..ఛీ కుక్క‌ని వ‌ద‌ల‌ని కామాంధులు

దేశంలో కామాంధుల ఆగాడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.ఇన్నాళ్లు మహిళలు, చిన్నారులపై ఆఘాయిత్యాలకు పాల్పడుతున్న కామాంధులు చివరికి మూగ జీవాలను కూడా వదలడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు వ్యక్తులు కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డారు. ముంబైలోని మాల్వాని చర్చ్ ప్రాంతంలో తిరిగే కుక్క ఓ రోజు కనిపించలేదు.అటుగా వెళ్తున్న సుధా ఫెర్నాండెజ్ అనే వణ్యప్రాణి సంరక్షకురాలికి తీవ్ర రక్త స్రావంతో కుంటుతూ నడుస్తున్న కుక్క అత్యంత దయనీయ స్ధితిలో కనిపించింది.

దానికి ఆహారం పెట్టి కుక్క శరీరాన్ని పరిశీలించగా.. దాని మర్మావయవాల నుంచి తీవ్ర రక్తస్రావం అవుతోంది, పడుకోవడానికి కూడా తీవ్రంగా ఇబ్బందిపడుతోంది. దీంతో సుధా కుక్కను తీసుకుని ఆసుపత్రికి వెళ్లింది. దానిని పరీక్షించిన వైద్యులు… కుక్కపై అత్యాచారం జరిగిందని ధ్రువీకరించారు.కుక్క కాళ్లని తాడుతో కట్టేసి.. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పారు. జరిగిన సంఘటనపై సుధా ఫెర్నెండెజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *