Building collapse in pawan meeting

పవన్ సభలో అపశృతి

న‌టుడు ,జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సోమవారం నాడు రాజమండ్రిలో క‌వాతు నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన రాజ‌మండ్రి స‌భ‌లో అపశృతి చోటు చేసుకొంది. వేదికకు సమీపంలోనే ఉన్న పురాతన భవనం పైకి పెద్ద సంఖ్యలో పవన్‌కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఎక్కారు. దీంతో ఈ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో పదిమందికి గాయాలైనట్టు సమాచారం. పురాతన భవనం కావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

దీంతో సుమారు 10 మందికి గాయాలైనట్టు సమాచారం. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పురాతన భవనం కావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొందని చెబుతున్నారు. జనసేన కవాతు ముగింపు సందర్భంగా సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహం సమీపంలో సభను నిర్వహించారు. సోమవారం నాడు పోలీసులు జనసేన కవాతుకు, సభకు అనుమతిని నిరాకరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *