Balakrishna died in google calculation

గూగుల్ లెక్క‌లో బాల‌కృష్ణ మ‌ర‌ణించ‌డ‌టా…!

ఎప్పుడు ఎవ‌రికి ఏ స‌మాచారం కావాలి అన్న ప్ర‌తి ఒక్క‌రు వాడేది గూగుల్‌.ప్ర‌స్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో గూగుల్ ప్ర‌తి ఒక్క‌రికి సొంత సాధ‌నంలా మారింది.మ‌రి అలాంటి సాధ‌న‌మే త‌ప్పు చూపిస్తే ఏం చేయాలి.సరిగ్గా అలాంటి సంఘట‌నే మ‌న తెలుగు రాష్ట్రంలోనే జ‌రిగింది. హీరో బాల‌య్య విష‌యంలో ఇలాంటి ప‌రిస్థితే జ‌రిగింది.హీరో బాల‌కృష్ణ‌ని గూగుల్ చంపేసింది.నందమూరి బాలకృష్ణ పేరుని సెర్చ్‌లో కొట్టినప్పుడు ఆయన చనిపోయినట్లుగా చూపిస్తుంది.బాల‌య్య హీరో , పైగా రాజ‌కీయ నాయకుడు కాబ‌ట్టి ఆయ‌న గురించి ఎక్కువ మంది గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు.అలా సెర్చ్ చేసిన‌వారికి బాల‌య్య 1913 న‌వంబ‌ర్ 2న జ‌న్మించిన‌ట్లుగా చూపిస్తుంది.

అదేవిధాంగా 1955 జులై 19న బాల‌య్య మ‌ర‌ణించిన‌ట్లుగా చూపిస్తుంది.గూగుల్లో బాల‌య్య మ‌ర‌ణించిన‌ట్లుగా చూపించ‌డం ప‌ట్ల ఆయ‌న అభిమానులు మండిప‌డుతున్నారు.ఓ సెల‌బ్రిటీ అయిన బాలయ్య‌కే ఇలా జ‌రిగితే , సామాన్యుల ప‌రిస్థితి ఏంటీ అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. బాలకృష్ణ సమాచారం కోసం వెతికితే కన్నడ సినిమా రంగంలో టి.ఎన్.బాలకృష్ణ అని మరో సీనియర్ నటులు గురించి కూడా చూపిస్తుంది గూగుల్‌. గ‌తంలో కూడా గూగుల్ అనేక త‌ప్పిద‌లు చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *