Ap cm chandrababu and pawan kalyan attend to marriage function

ఒకే వేదిక‌పై చంద్ర‌బాబు,ప‌వ‌న్ క‌ల్యాణ్

2014 ఎన్నిక‌ల‌ప్పుడు చాలా రాజకీయ వేదిక‌ల మీద క‌లిసి కూర్చున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు,జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.కాని ఇప్ప‌డు ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది.ఏపీ ప్ర‌భుత్వం అవినీతిమ‌యంగా మారింద‌ని ప‌వ‌న్ చంద్ర‌బాబుని విమ‌ర్శిస్తున్నారు.అయితే చాలా రోజుల త‌రువాత వీరిద్ద‌రు ఒకే వేదిక‌పై క‌లుసుకున్నారు.

విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కుమారుడి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు  హాజరయ్యారు.అయితే వీరిద్ద‌రు ఒక‌రినొకరు చూసుకున్నారు కాని ,మాట్లాడుకోలేద‌ని తెలుస్తుంది.రాజ‌కీయ వైరంతోనే వీరిద్ద‌రు మాట్లాడుకోలేద‌ని స‌మాచారం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *