‘అంత‌రిక్షం’ దుబాయ్ రివ్యూ

ఘాజీ సినిమాతో అంద‌రిని త‌న‌వైపు తిప్పుకున్న ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి.అత‌ను తాజాగా ద‌ర్శ‌కత్వం వ‌హించిన సినిమా అంత‌రిక్షం. ఈ సినిమాలో మెగా హీరో వ‌రుణ్ తేజ్ న‌టించాడు.రెండు వ‌రుస విజ‌యాల‌తో మంచి ఊపు మీద ఉన్న వ‌రుణ్ తేజ్‌కు ఈ సినిమా ఎలాంటి విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.స్పేస్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న మొద‌టి తెలుగు సినిమా కావ‌డంతో సినిమాపై అంద‌రికి ఆసక్తి పెరిగింది.ఈ సినిమా ఈ రోజే విడుద‌ల‌వుడుతుంది.ఇప్ప‌టికే ప‌లు దేశాల‌లో విడుద‌లైంది ఈ సినిమా అక్క‌డి నుంచి వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయ‌త్నం చేద్దాం.ప్రపంచం మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ కి సంబంధించిన ప్రాబ్లమ్ ఫెస్ చేయనుందని పసిగట్టిన ఇండియన్ స్పెన్ స్టేషన్ దాన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలని డిసైడ్ అవుతారు. కథానాయకుడు దేవ్(వరుణ్ తేజ్) తీసుకున్న ఒక నిర్ణయం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.

స్పెస్ లోకి వెళ్లిన దేవ్ టీమ్ ఊహించని పరిణామాలను ఎదుర్కొంటుంది. సెకండ్ ఆఫ్ ట్విస్ట్ సినిమాలో మెయిన్ హైలెట్. ఫస్ట్ హాఫ్ లో ఆడియేన్స్ కి పూర్తి కథ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఇక సెకండ్ ఆఫ్ లో దర్శకుడు విజువల్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే కీలకమైన విఎఫ్ఎక్స్ విషయంలో చిత్ర యూనిట్ అనుకున్న అవుట్ పుట్ ఇవ్వలేదనే టాక్ వస్తోంది. కొన్ని కొత్త విషయాలని అర్ధమయ్యేలా చెప్పారు. కానీ ఆడియెన్స్ కి అంతగా థ్రిల్ అనిపించకపోవచ్చు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకంగా నిలిచిందని చెప్పవచ్చు. ఇక కెమెరా పనితీరు సినిమాకు ఆయుధంలా నిలువగా.. వరుణ్ తేజ్ నటన కూడా స్క్రీన్ పై ఆకట్టుకుంటుంది. పూర్తి రివ్యూ మ‌రికొద్ది సేప‌ట్లో మీ ముందు ఉంచుతాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *