టాలీవుడ్ హీరోయిన్ ఇన్‌స్టాగ్రాం హ్యాక్ అయిందట.ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది.‘నా ఇన్‌స్టాగ్రాం హ్యాక్ అయింది. అది రికవర్ అయ్యేంత వరకూ దాని నుంచి వచ్చే ఏ లింక్స్ పట్ల, మెసేజ్‌ల పట్ల స్పందించవద్దు’’ అని రకుల్ ట్వీట్‌లో అభిమానులను కోరింది.ఈ బ్యూటీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది.
సినిమా చూసి రివ్యూలివ్వడం దగ్గర నుంచి పుట్టిన రోజులకు శుభాకాంక్షలు చెప్పడం వంటివన్నీ చాలా సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.ప్రస్తుతం టాలీవుడ్‌లో కథానాయిక రకుల్ ప్రీత్‌కి పెద్దగా సినిమాలేమీ లేవు. ఈ మధ్యే అమ్మడు ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రలో మెప్పించబోతోంది. ఈ చిత్రం తప్పితే ముద్దుగుమ్మకు సినిమాలు లేవు.