అవును మీరు విన్నది నిజమే.రాజమౌళి తీయబోయే సినిమాలో హీరోలకి పారితోషికం లేదని తెలుస్తుంది.దర్శక ధీరుడు రాజమౌళి తన తరువాత సినిమాను ఎన్టీఆర్,రామ్ చరణ్‌లతో తీస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగు కోసం ఎన్టీఆర్ .. చరణ్ 200 రోజులను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పారితోషికంగా వాళ్లకి ఎంత మొత్తం ముడుతోందనేది ఆసక్తికరంగా మారింది. అలాగే రాజమౌళి పారితోషికం గురించిన చర్చలు కూడా ఫిల్మ్ నగర్లో నడుస్తున్నాయి.
అయితే ఈ సినిమాకిగాను ఎన్టీఆర్ గానీ .. చరణ్ గానీ పారితోషికం తీసుకోవడం లేదట. లాభాల్లో వాటా తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అలాగే రాజమౌళికి కూడా లాభాల్లో వాటా దక్కనుంది. లాభాల్లో వాటా అయితే ఒక్కో హీరోకి 50 కోట్ల వరకూ ముట్టే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఎక్కువ రోజులు కేటాయిస్తుండటం వలన, వాళ్ల క్రేజ్ కి తగినట్టుగానే ముడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హీరోయిన్లు,టెక్నిషిన్స్ గురించి త్వరలోనే తెలియజేయనున్నారు.